విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో ఉంది కొదమ పంచాయతీలోని సిరివాడ గ్రామం. అక్కడ సుస్తి చేస్తే చుక్కలు చూడాల్సిందే. ఇదేవిధంగా జ్వరం, వాంతులతో బాధపడుతున్న వ్యక్తి గ్రామంలో వైద్య సదుపాయం లేక.. నగరానికి వెళ్లే మార్గం లేక.. వారం రోజులుగా అలాగే ఉండిపోయాడు. ఇది గమనించిన యువత ముందుకొచ్చి కొండ మీద నుంచి నాలుగు కిలోమీటర్లు డోలిలో ఆ వ్యక్తిని రహదారిపైకి తీసుకొచ్చారు. అక్కడినుంచి వాహనంలో ఒడిశాలోని నారాయణపట్టణం ఆసుపత్రికి తరలించారు.
మారుమూల గ్రామమే కావచ్చు.. మౌలిక వసతులు అందుబాటులో లేకపోవచ్చు.. ఈ ఆదునిక కాలంలో ఎలాంటి పరిస్థితినైనా మార్చేందుకు అంతగా సమయం పట్టదు కదా అంటున్నారు స్థానిక యువత. ఏళ్లు గడుస్తున్నా.. ఇలాంటి డోలి ఘటనలు పునరావృతమవుతున్నా.. మా బాధలు పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని యువత వాపోతుంది.
ఈ మధ్యే ఇదే పంచాయితీలో గిరిజనులు సంకల్పించి రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీంతో సామాన్యుల వల్ల కాగలిగిన కార్యం.. రాజ్యాలు ఏలే సామంతుల వల్ల కాకపోవడం ఎవరికైనా విడ్డూరంగానే అనిపిస్తుంది మరీ.
ఇవీ చూడండి...