ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ధర్నాకు దిగారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. తమ డిమాండ్లు పరిష్కరించాలని విద్యార్థులు నినాదాలు చేశారు.
విశాఖలో ఆందోళన
విశాఖ జిల్లా పాడేరులో రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. పాడేరు అంబేద్కర్ కూడలి నుంచి ఐటీడీఏ వరకు ర్యాలీగా తరలివచ్చారు. పెండింగ్లో ఉన్న 10 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విజయనగరంలో ఉద్రిక్తం
విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నాకు దిగారు. విద్యార్థులు కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. విద్యార్థులకు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం స్పందించి వెంటనే పీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: