కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి, విశాఖపట్నంలో ముస్లిం మైనార్టీ సంఘాలు ఆందోళన నిర్వహించారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బైఠాయించారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేతలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. వీరి ఆందోళనకు వామపక్షాలు సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతిచ్చాయి. ముస్లింలను ఈ దేశం నుంచి వెళ్లగొట్టాలని కుటిల ప్రయత్నంలో భాగంగా... మోదీ సర్కార్ తీసుకున్న అమానుష చర్యగా పౌరసత్వ సవరణ బిల్లు నిలుస్తుందని వామపక్షాలు ఆరోపించాయి.
రోడ్లపై భైఠాయింపు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకిస్తూ.. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేరలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక బస్టాండ్లో నిరసనకు దిగారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోనూ వామపక్షాలు, ముస్లిం సోదరులు స్థానిక పాత బస్టాండ్ వద్ద నిరసన చేపట్టారు. రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చట్టాన్ని రద్దు చేయకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని ముస్లిం సంఘాల నేతలు హెచ్చరించారు.
ఇదీ చదవండి: