విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని జడ్కుమరాం కేకే రైల్వే రెండో లైన్ పనుల్లో భాగంగా... ఇనుప ఊచలు తీసుకెళ్తున్న వ్యాను అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వ్యాన్లో ఉన్న ఏడుగురు కూలీలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం విజయనగరం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచదవండి.