విజయనగరం జిల్లాలో రెండో విడత కొవిడ్ వాక్సినేషన్ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ హరి జవహర్ లాల్ ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ స్వయంగా వాక్సిన్ వేయించుకున్నారు.
"రెండో విడతలో జిల్లాలోని రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలకు చెందిన 27 వేల మంది అధికారులు, ఉద్యోగులు వాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తొలి విడతలో 17 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. 11 వేల మందికి వ్యాక్సిన్ వేశాం. వాక్సినేషన్లో జిల్లానే ప్రథమ స్థానంలో ఉంది. కరోనా వ్యాక్సిన్ ఎంతో సురక్షితం. ఎవరు అపోహలకు గురికావద్దు. టీకా వేయించుకుంటేనే కరోనా నుంచి రక్షణ పొందగలం". -హరి జవహర్ లాల్, విజయనగరం జిల్లా కలెక్టర్
ఇదీ చదవండి