ప్రకాశం జిల్లాలో...
కొమరోలు మండలంలోని అక్కపల్లి అటవీ ప్రాంతంలో నాటుసారా బట్టీలపై ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నాటుసారా తయారీ కోసం సిద్ధంగా ఉంచిన 1,200 లీటర్ల బెల్లం ఊటను అధికారులు ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేసినా, అమ్మినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఈబీ అధికారులు హెచ్చరించారు.
చిత్తూరు జిల్లాలో...
నగరి మండలం మాంగాడు దళితవాడలో పుత్తూరు డీఎస్పీ ఆధ్వర్యంలో నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ముగ్గురు వ్యక్తుల నుంచి 40 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేశారు. అక్రమంగా సారా తయారుచేసే వారిపై పిడియాక్ట్ కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
విజయనగరం జిల్లాలో...
పార్వతీపురం మండలం గోచెక్క సమీపంలో ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న 440 లీటర్ల నాటుసారాను ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. ముగ్గురు యువకులను అరెస్టు చేసి, రెండు వాహనాలను సీజ్ చేశారు.
కర్నూలు జిల్లాలో...
కర్నూలు జిల్లా ఆదోనిలోలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా తయారీకి ఉపయోగించే 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
ఇదీచదవండి.