విజయనగరం జిల్లా పార్వతీపురం విశ్వ విజ్ఞాన పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించారు. సోలార్, విండ్ విద్యుత్, డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మదర్శిని ప్రాజెక్టు, కార్బోహైడ్రేట్స్ పవర్ ఇరిగేషన్, సౌరశక్తితో కాలువలో చెత్త తొలగింపు వంటి ప్రయోగాలు ఆకట్టుకున్నాయి. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో పట్టణంలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు తాము చేసిన ప్రయోగాలతో పాల్గొన్నారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ప్రయోగ విధానాన్ని ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.
ఇదీచదవండి.