బొబ్బిలి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక పూర్తి అయింది. 11వ వార్డుకు చెందిన కౌన్సిలర్.. సావు వెంకట మురళీకృష్ణ రావు ఛైర్మన్గా ఏకగ్రీవమయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్లు ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరయ్యారు. ఇక్కడ వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.
నూతనంగా ఎన్నికైన ఛైర్మన్ కృష్ణారావును ఎంపీ బెల్లాన, ఎమ్మెల్యే శంబంగి సత్కరించారు. పురపాలక అభివృద్ధి కోసం దోహదపడతామని.. నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. వెంకట మురళీ కృష్ణ రావు ఎన్నికపై 12వ వార్డు కౌన్సిలర్ శారద అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: