విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, డెంకాడ మండలం, పెదతడివాడ కేంద్రాల్లో ప్రభుత్వ విక్రయ కేంద్రాల్లో ఇసుక నిల్వలు తగ్గాయి. గత కొన్ని రోజులుగా వర్షాలు కురవడం వల్ల శ్రీకాకుళం జిల్లా నాగావళి నుంచి రావలసిన ఇసుక... కేంద్రాలకు చేరలేదు. వర్షాకాలం నేపథ్యంలో జిల్లాలో ఇసుక కొరత లేకుండా సుమారు 15 వేల మెట్రిక్ టన్నుల చొప్పున కేంద్రాల్లో అధికారులు ముందస్తుగా నిల్వచేశారు. నదుల్లో నీరు చేరడం వల్ల ప్రస్తుతం ఇసుక తీసేందుకు అవకాశం లేకపోవడం వల్ల నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఒక్కో కేంద్రంలో 4 వేల మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే నిల్వ ఉంది. రోజుకు 500 మెట్రిక్ టన్నుల ఇసుక అమ్ముడవుతోంది.
పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులకు ఇసుక ఇచితంగా సరఫరా చేస్తున్నారు. ఈ సమయంలో నాగావళి నుంచి ఇసుక వస్తేనే... ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే వినియోగదారులకు ఇసుకను అందించగలమని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి :