విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో మీ సేవ కేంద్రం వద్ద గ్రామ వాలంటీర్ల పోస్టులకు దరఖాస్తు చేసేందుకు నిరుద్యోగులు బారులు తీరారు. జులై 5తో దరఖాస్తులు ముగియడంతో పలు గిరిజన గ్రామాల నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకునేందుకు మీసేవ కేంద్రాల్లో, నెట్ సెంటర్లలో అధిక సంఖ్యలో క్యూ కడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు.
ఇదీ చదవండీ: ఊసరపెంట పరువు హత్య కేసులో నిందితులు అరెస్టు