విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం నీలకంఠాపురం సమీపంలో ముకుందపురం గ్రామం రహదారి మలుపు వద్ద ఆర్టీసీ బస్ బోల్తా పడింది. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని నీలకంఠాపురం ఆసుపత్రికి తరలించారు. మలువు సమీపంలో రోడ్డుకి అనుకుని గొయ్యి ఉండడంతో స్టీరింగ్‌ను అదుపు చేయలేక పోయానని డ్రైవర్ చెబుతున్నారు. బస్సులో కండక్టర్‌తోపాటు 20 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఇదీ చూడండి... రైలు నుంచి జారిపడి.. వివాహిత మృతి