విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువత రోడ్డు ప్రమాదాలకు గురై విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. వాహనాలు నడిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాహన చోదకుడితో పాటు వాహనానికి బీమా అవసరమని రాష్ట్ర ఆర్థిక కమిషన్ సభ్యులు తూముల భాస్కర రావు చెప్పారు. వైకాపా నేత గోపాల్ రావు ,సీఐ శోభన్ బాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఎంపీ బెల్లాన జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ఫ్లెక్సీ చూపుతూ అవగాహన కల్పించారు.
ఇదీ చదవండి: ఫిబ్రవరి 1 నుంచి ఇంటి వద్దకే రేషన్ బియ్యం: కలెక్టర్