విజయనగరం జిల్లా వ్యాప్తంగా.. 72వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్, ఎస్పీ రాజకుమారి జాతీయ పతకాన్ని ఆవిష్కరించి.. స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు. అనంతరం పోలీసుల దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
పోలీస్ పరెేడ్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో.. విద్యార్థుల విన్యాసాలు, నృత్యాలు, వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శనలు కనువిందు చేశాయి. అనంతరం విధుల్లో అత్యున్నత ప్రతిభ కనబరచిన ఉద్యోగులకు.. కలెక్టర్ ప్రసంశ పత్రాలు, మెమెంటోలను అందజేసి సత్కరించారు.
పార్వతీపురంలో
పార్వతీపురం నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద జెండా ఎగురవేసి వందనం స్వీకరించారు. జిల్లా కోర్టు వద్ద రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి సీహెచ్ రాజగోపాలరావు జెండా ఎగురవేశారు. గణతంత్ర వేడుకల ప్రాధాన్యతను వివరించారు. ఐటీడీఏ, ఆర్డీవో కార్యాలయాల వద్ద.. జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
గణతంత్ర వేడుకల సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఐటీడీఏ కార్యాలయం వద్ద వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజన, ఆశ్రమ, గురుకుల పాఠశాలల విద్యార్థులు.. దేశభక్తి, ఆధ్యాత్మిక గీతాలకు నృత్యాలు చేశారు.
ఇదీ చదవండి: