శతాబ్ది కాలంలో రెడ్ క్రాస్ ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టిందని.. విజయనగరం జిల్లా కలెక్టర్ అన్నారు. రెడ్ క్రాస్ శత జయంతిని పురస్కరించుకుని.. శ్రీకాకుళంలో మొదలైన సైకిల్ ర్యాలీ.. విజయనగరం చేరుకుంది. కలెక్టరేట్ నుంచి.. సైకిల్ ర్యాలీని కలెక్టర్ హరిజవహర్‌లాల్ ప్రారంభించారు. ఈ ర్యాలీ శ్రీకాకుళం నుంచీ విజయవాడ వరకు సాగనుంది. రెడ్ క్రాస్ సంస్థ రక్త దానంతో ఎందరో పేదలకు పునర్జన్మ కలిగిందన్న కలెక్టర్... భవిష్యత్తులో మరిన్ని సేవలు కొనసాగించాలని ఆకాక్షించారు.
ఇదీ చదవండి: కరోనా నివారణ చర్యలను.. ప్రధానికి వివరించనున్న సీఎం