విజయనగరం జిల్లా చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మతిస్థిమితంలేని రోగిపై శానిటరీ సూపర్ వైజర్ అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... చీపురుపల్లి మండలం పేరిపికి చెందిన ఉప్పాడ రేణుక అనే యువతి మంగళవారం ఉదయం జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరింది. వైద్య పరీక్షల అనంతరం వైద్యులు యువతిని 23వ వార్డులో చేర్చారు. యువతికి తోడుగా వచ్చిన తల్లి... సాయంత్రం డాక్టర్ను కలవడానికి వెళ్లింది. శానిటరీ సూపర్ వైజర్ రామచంద్రరావు ఆ యువతిపై అత్యాచారయత్నం చేశాడు. పక్క వార్డులో ఉన్న మహిళ గమనించటంతో రామచంద్రరావు యువతిని వదిలేసినట్లు ప్రత్యేక్ష సాక్షులు తెలిపారు. ఈ విషయాన్ని యువత తల్లిదండ్రులు ఆస్పత్రి వైద్యులకు ఫిర్యాదు చేయగా.. వారి సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్పత్రిలో అఘాయిత్యం... మతిస్థిమితంలేని యువతిపై అత్యాచారయత్నం!
ఆస్పత్రిలో అఘాయిత్యం జరిగింది. మతిస్థిమితంలేని యువతిపై అక్కడి ఓ ఉద్యోగి అత్యాచారయత్నం చేశాడని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నాడు.