విజయనగరం జిల్లాలో వేసవి నువ్వుల పంట ఏపుగా పెరిగి రైతుల్లో ఆశలు నింపుతోంది అడపాదడపా కురిసిన వర్షాలు ఈ పంటకు అనుకూలించాయి. పార్వతీపురం గరుగుబిల్లి జిఏం వలస సీతానగరం బలిజిపేట తదితర మండలాల్లో వందలాది హెక్టార్లలో నువ్వుల సాగు చేపట్టారు. తోటపల్లి బ్యారేజీ కాలువల కింద చేపట్టిన సాగు మంచి దిగుబడి ఇచ్చే విధంగా ఆశలు రేపుతోంది. వర్షాధార భూములకు వరుణదేవుడు కరుణించటంతో..ఈ ఏడాది నువ్వు పంట మంచి దిగుబడి ఇచ్చే విధంగా ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో వేసిన నువ్వు పంటతో వచ్చే ఆదాయం ఖరీఫ్ వరి సాగు పెట్టుబడులకు వినియోగించడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా వస్తోంది. గత రెండేళ్లలో వేసవి నువ్వు పంటకు వర్షాలు కలిసిరాక దిగుబడి తగ్గింది. ఈ ఏడాది వరుణదేవుడు కరుణతో మంచి ఆదాయం వచ్చే పరిస్థితి ఉందని రైతులు అంటున్నారు.
ఇది చదవండి 'వర్క్ ఫ్రం హోమ్' చేసే వారికి జియో గుడ్ న్యూస్!
కురిసిన వర్షాలు..ఆశాజనకంగా నువ్వుల పంట - latest crop news
విజయనగరం జిల్లాలో వేసవి నువ్వుల పంట రైతుల్లో ఆశలు నింపుతుంది. ఇటీవల కురిసిన వర్షాలు నువ్వు సాగుకు అనుకూలించాయి. ఏపుగా పెరిగిన నువ్వు పంట పూత పిందెలతో ఆశాజనకంగా ఉందని రైతులు తెలిపారు.