విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లిలో గిరిజన ఆశ్రమ పాఠశాలలోకి వర్షపు నీరు చేరి బాలికలు ఇబ్బందిపడ్డారు. దీంతో వారందరినీ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు తరలించి వసతి సదుపాయాలు ఏర్పాటు చేశారు. గులాబ్ తుపాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వసతి గృహంలోని నీరు రావడమే గాక.. ఆహార దినుసులన్నీ నీటిలో తడిచిపోయాయి.
ఇదీ చదవండీ.. PROJECTS: నిండుకుండలా జలాశయాలు.. పొంగుతున్న నదులు