కరోనా వ్యాప్తి దృష్ట్యా సిరిమానోత్సవానికి మూడంచెల పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. బందోబస్తుకు 2116మంది పోలీసు అధికారులు, సిబ్బందిని నియామించారు. అదేవిధంగా.. సిరిమాను తిరిగే ప్రధాన మార్గంలో 45 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. కొవిడ్-19 వైరస్ వ్యాప్తి దృష్ట్యా అమ్మవారి ఆలయ పరిసరాల్లోకి ఉదయం 11 గంటల నుంచి భక్తులకు అనుమతి నిషేధించారు. విజయనగరంలో దుకాణాలన్నీ పూర్తిగా మూసివేశారు. ఇతర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రంలోకి వచ్చే వాహనాల రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. అంతర్రాష్ట్ర, జిల్లా, మండల సరిహద్దుల్లో 26 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అయితే, అత్యవసర వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఇదీ చదవండి: కేంద్రం కొర్రీపై నవంబరు 2న అత్యవసర భేటీ