Sirimanu Utsav In Vizianagaram : ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, విజయనగరం రాజుల ఆడపడుచు పైడితల్లి అమ్మవారి జాతరకు అంకురార్పణ చేశారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా పందిరాట వైభవంగా నిర్వహించారు. అమ్మవారి మెట్టినిల్లు చదరగుడి, పుట్టినిల్లు వనంగుడిలో పందిరాట నిర్వహించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
సిరిమాను ఉత్సవాలు నేటితో మొదలై నెలరోజులపాటు జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ పండితుల వేదమంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల మధ్య నవ ధాన్యాలతో పుజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. గుడిలో ముగ్గులు వేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. సిరిమాను ఉత్సవాలు నేటితో మొదలై నెలరోజులపాటు జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: