ETV Bharat / state

అంబులెన్స్​లో ప్రసవం.. తల్లీకుమార్తె క్షేమం - parvathipuram latest news

అంబులెన్స్​లో ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే ఓ గర్భిణి ప్రసవించి... పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆస్పత్రికి తీసుకెళ్లారు. తల్లీకుమార్తెల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

delivery in ambulance
తల్లీబిడ్డలు
author img

By

Published : May 31, 2021, 7:04 AM IST

విజయనగరం జిల్లా చినమేరంగి సీహెచ్​సీ​ నుంచి పార్వతీపురం ప్రాంతీయ ఆస్పత్రికి గర్బిణిని తరలిస్తుండగా.. అంబులెన్స్​లోనే ప్రసవించింది. జీఎం వలస మండలం బల్లేరుగూడ గ్రామానికి చెందిన జాస్మిన్​ కు పురిటి నొప్పులు మొదలవగా.. దగ్గర్లోని చినమేరంగి సీహెచ్​సీకి తీసుకెళ్లారు.

అక్కడ సిబ్బంది పరీక్షించి.. పార్వతీపురం ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడి నుంచి అంబులెన్స్​లో పార్వతీపురం బయలుదేరాక కొత్తవలస వద్ద పురిటినొప్పులు ఎక్కువై… 108 సిబ్బంది సేవలందిస్తుండగానే జాస్మిన్​ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి:

Cm Jagan: 14 వైద్య కళాశాలల నిర్మాణానికి నేడు సీఎం జగన్ శంకుస్థాపన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.