విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి గ్రామ సమీపంలో 1100 లీటర్ల నాటుసారాను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో పలుచోట్ల నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు.
ఈ దాడిలో 1100 లీటర్ల నాటుసారాతో పాటు ఓ బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకుని.. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: వృద్ధురాలన్న కనికరం లేదు... బస్సులో నుంచి దించేసిన సిబ్బంది