విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ గ్రామ పరిధిలో అక్రమంగా ఆటోలో తరలిస్తున్న ఖైనీ గుట్కా బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన పి. రమేష్ అనే వ్యక్తి నుంచి సుమారు 30 వేల రూపాయల విలువైన సరకును పట్టుకున్నామని ఎస్సై బాలాజీ రావు తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి