విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో.. ఎక్సైజ్ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామంలో పోలమాంబ జాతర సందర్భంగా.. మద్యం దుకాణాల వద్ద మందుబాబులు ఎటువంటి ఘర్షణ పడకుండా ఉండేందుకు ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మందుబాబులు క్యూలైన్లలలో వెళ్లి మద్యం తీసుకునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారనీ... ఇందుకోసం మద్యం దుకాణం వద్ద 20 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు.
ఇదీ చదవండి: పోలమాంబ పూజలకు ముస్తాబైన శంబర