రామతీర్థం సందర్శనకు వెళ్లేందుకు బయల్దేరిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజనాథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకున్న ఆయన తొలుత మీడియా సమావేశం నిర్వహించారు. కార్యకర్తలతో కలసి రామతీర్థం సంఘటన ప్రాంతానికి పయనమవుతుండగా పోలీసులు కార్యాలయాన్ని చుట్టుముట్టారు. కార్యకర్తలతో పాటు... శైలజనాథ్ను అదుపులోకి తీసుకుని చేసి ఒకటో పట్టణ పోలీసుస్టేషన్ కు తరలించారు.
రామతీర్థం ఘటన చాలా బాధాకరం. రామతీర్థంలో సంఘటన పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. కోదండరాముడి విగ్రహం ధ్వంసం వెనుక ఉన్న దోషులను వెంటనే అదుపులోకి తీసుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఏ రోజూ కూడా ఇలాంటి ఘటన జరగలేదు. ఒకవేళ జరిగినా అప్పటి ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకున్నాయి. మతాలకు అతీతంగా రాజకీయాలు ఉండాలి. ఈ విషయంలో భాజపా వాళ్లు డ్రామాలు ఆడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా నిందితులను పట్టుకోలేకపోతున్నారు. ప్రజా ఉద్యమాలు చేస్తున్న నాయకులను మాత్రం అరెస్టు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేసును సీఐడీకి అప్పగించి, ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. - శైలజనాథ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి
కిడ్నాప్ కేసులో ట్విస్ట్: ఏ-1 ఎ.వి.సుబ్బారెడ్డి, ఏ-2గా అఖిలప్రియ