విజయనగరం జిల్లా పార్వతీపురం నుంచి రాయగడ వెళ్లే రాష్ట్ర రహదారికి మరమ్మతులు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో పట్టణ కమిటీ సభ్యులు నిరసన చేపట్టారు. పార్వతీపురం నుంచి ఒడిశా సరిహద్దు వరకు రహదారులు పూర్తిగా పాడైపోయాయని అన్నారు. రోడ్లపై పెద్ద పెద్ద గోతులు ఉన్న కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వర్షాకాలంలో ఆ గోతుల్లో నీరు చేరటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తక్షణమే రహదారులకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: