ETV Bharat / state

"అంటు వ్యాధులు ప్రబలకుండా... పారిశుద్ధ్యం పై దృష్టి సారించండి" - శంబర పోలమాంబ అమ్మవారి జాతర

శంబర పోలమాంబ అమ్మవారి జాతరలో... భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను... పార్వతీపురం సబ్ కలెక్టర్ విదేహ ఖరే ఆదేశించారు. అందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... భక్తులకు అమ్మవారి దర్శనం కల్పంచాలన్నారు.

Meeting
సమావేశం
author img

By

Published : Jan 12, 2021, 12:10 PM IST

విజయనగరంలోని మక్కువ మండలంలో జరుగుతున్న శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను... పార్వతీపురం సబ్ కలెక్టర్ విదేహ ఖరే ఆదేశించారు. పోలమాంబ అమ్మవారి ఆలయం వద్ద ఆయన సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా చెత్తను డంప్ చేయడం, క్లోరినేషన్ తదితర చర్యలు చేపట్టాలని సూచించారు.

వైద్యారోగ్య శాఖ మెడికల్ శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. 108 వాహనాల ద్వారా అత్యవసర సేవలు అందించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పార్కింగ్ పై దృష్టి సారించాలని.. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా... వేర్వేరుగా ఎంట్రన్స్, ఎగ్జిట్ ఏర్పాటు చేయాలని సూచించారు. కొవిడ్ నిభందనలు అందరూ పాటించాలని పేర్కొన్నారు. దర్శనానికి వచ్చిన భక్తులు తప్పకుండా మాస్క్ ధరించి, చేతులు శుభ్రం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని చెప్పారు. అందుకు తగిన విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో హెండ్ వాష్ బేసిన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.

జాతరలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీస్ శాఖ పటిష్ఠమైన బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు దేవాదాయ శాఖ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు, మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పారు. విద్యుత్ కు ఏటువంటి అంతరాయం కలుగకుండా విద్యుత్ శాఖ ముందుగా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎ.సుభాష్, అసిస్టెంటు కమిషనర్ చెన్న గంగా రావు, శంభర పొలమాంబ ఆలయ ఈవో, మున్సిపల్, వైద్యారోగ్య, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'అమ్మఒడి' పేద విద్యార్థులకు శ్రీరామరక్ష: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.