పార్వతీపురం పురపాలక సంఘం ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెల్లడయ్యాయి. పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపు జరిగింది. ఎన్నికల అధికారి ఐటీడీఏ పీవో కూర్మనాథ్ ఉప కలెక్టర్ విధికరే డీఎస్పీ సుభాష్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించారు.
పార్వతీపురం పుర పాలిక ఫలితాలు..
పార్వతీపురం మున్సిపాలిటీ వైకాపా కైవసం చేసుకుంది. మొత్తం 30 వార్డుల్లో 6 వార్డుల్లో ఇప్పటికే వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి. 24 వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైకాపా 16 స్థానాల్లో విజయం సాధించింది. తెదేపా ఐదు స్థానాల్లో గెలుపొందగా.. మూడు స్థానాల్లో స్వతంత్రులు సత్తా చాటారు.
ఇవీ చూడండి...: పార్వతీపురం లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్సీకి గాయాలు