విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలంలో సచివాలయ భవన నిర్మాణాలను పంచాయతీరాజ్ జిల్లా అధికారి పి .విజయ్ కుమార్ పరిశీలించారు. ముందుగా మండల కేంద్రంలో జరుగుతున్న భవన నిర్మాణాలు పరిశీలించి ఆరా తీశారు. ఇసుక ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారని... ఇసుక బాగోలేదని ,ఇటుక నాణ్యత పాటించడం లేదంటూ సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని, లోపాలు కనిపిస్తే తక్షణమే పనులు నిలిపివేసి తప్పులు పునరావృతం కాకుండా చేస్తున్నామన్నారు. జిల్లాలో 458 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. 225 కోట్లతో 150 రహదారుల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ జరుగుతోందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్పమంలో డీఈ వెంకట్రావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి.