లాక్డౌన్తో మూతపడిన దేవాలయాలను తెరిచేందుకు, భక్తులకు దర్శనం కల్పించేందుకు ఆలయాల సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో ప్రధాన దేవాలయాలన్నీ తిరిగి ప్రారంభించేందుకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. విజయనగరం పట్టణంలోని పైడితల్లి అమ్మవారి ఆలయంలో సిబ్బంది, పూజారులతో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈనెల 10 నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కరోనా నివారణ జాగ్రత్తల్లో భాగంగా దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు వివరాలను నమోదు చేయించుకోవాలి. తప్పనిసరిగా మాస్కు ధరించాలి. ఒక్కొక్కరి మధ్య దూరం 6 అడుగులు పాటించాలని ఆదేశాలు ఇచ్చారు. ఆలయ పరిసరాల్లో కొబ్బరికాయ కొట్టడం, తీర్థం ఇవ్వటం, ఆశీర్వచనాలు పొందటం నిషేధించారు. క్యూలో ఉన్నప్పుడు చేతులు శానిటైజ్ చేసుకోవాలని ఆలయ ప్రధాన పూజారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: