అత్యవసర వైద్యసేవలకు ఉపయోగించే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను (Oxygen concentrators) ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వైద్యాధికారులకు అందజేశారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగిలోని తన క్యాంపు కార్యాలయంలో వాటిని వైద్యులకు అందించారు. చినమేరంగి, కురుపాం, భద్రగిరి, సాలూరు సామాజిక వైద్య కేంద్రాలకు, పార్వతీపురం ఏరియా ఆస్పత్రుల్లో వీటిని వినియోగించనున్నట్లు ఉపముఖ్యమంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్ సూచన మేరకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని సహకారంతో ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొత్తం 30 కాన్సంట్రేటర్లను కురుపాం నియోజకవర్గంలోని వైద్యశాలలకు అందించామని పుష్ప శ్రీవాణి వెల్లడించారు.
ఇదీచదవండి
DSC-2008: డీఎస్సీ-2008 బాధితుల కోసం ప్రత్యేక రిక్రూట్మెంట్: మంత్రి సురేశ్