విజయనగరం జిల్లా పాచిపెంట మండల పరిధిలో ఉన్న ఆంధ్ర - ఒడిశా ఘాట్ రోడ్డు సమీపంలో ప్రమాదం జరిగింది. జైపూర్ నుంచి విజయనగరం వెళ్తున్న వ్యాను.. ఘాట్ రోడ్డు మూలమలుపులో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది.
వ్యాన్ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. విశాఖ జిల్లాలోని కేజీహెచ్‌కు తరలించారు. బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల ఎదురుగా ఉన్న లారీని వాహనం ఢీకొట్టినట్టు డ్రైవర్ తెలిపాడు. పాచిపెంట ఎస్సై రమణ కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: