కరోనా నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్‌తో అత్యవసరమైతేగాని ఎవరూ రహదార్లపైకి రాకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నిర్ణీత వేళల్లోనే వ్యాపారాలు చేయాలని సూచించింది. అయితే కొందరు ఈ ఆదేశాలను ఉల్లంఘించారు. విజయనగరం జిల్లాలో అవసరం లేకున్నా రోడ్ల మీదకు వస్తున్నారని అంటువ్యాధుల నివారణ చట్టం, ప్రభుత్వ ఆదేశాల ధిక్కరణ కింద పలువురిపై జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి.
జిల్లా వ్యాప్తంగా గత నెల మార్చి 23 నుంచి ఈ నెల ఏప్రిల్ 9 వరకు.. 20 వేల వాహనాలపై ఈ-చలానా కేసులు నమోదు చేశారు. సుమారు కోటికి పైచిలుకు జరిమానా విధించారు. ఇందులో జిల్లా కేంద్రంలో 3000, బొబ్బిలి, కొత్తవలస, పార్వతీపురం స్టేషన్ల పరిధిలో 1500 చొప్పున నమోదయ్యాయి. నిత్యావసర, కూరగాయల దుకాణాలు.. సమయం దాటి దుకాణాలు తెరిచారన్న అభియోగంతో 592 మందిపై కేసులు నమోదు చేశారు. ద్విచక్ర వాహనంపై ఒకరి కంటే ఎక్కువ ఉండరాదని తెలుపగా... నిబంధనను ఉల్లంఘించిన 273 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: