ఈ వృద్ధురాలు విజయనగరం జిల్లా సాలూరు మండలం కూర్మ రాజుపేట గ్రామానికి చెందిన మహదేవ్ కొత్తమ్మ. వయస్సు 80 ఏళ్లు. ఆధార్‌లో మాత్రం పుట్టిన తేదీ పొరపాటున 1990 గా నమోదైంది. అంటే ఆధార్ ప్రకారం ఇప్పుడామె వయసు 31 ఏళ్లు. అదే ఆమె కొంప ముంచుతోంది. ఆధార్‌ను ప్రామాణికంగా చూపి ఆమెకు రావాల్సిన పింఛను నిలిపేస్తున్నారు అధికారులు. పదిహేనేళ్ల కిందట ఆమె భర్త చనిపోగా.. ఇద్దరు కుమారులు పెళ్లిళ్లు చేసుకుని వేర్వేరుగా ఉంటున్నారు. ఆమెకు రెండు కళ్లు కనిపించవు. ఇంతగా ఇబ్బంది పడుతున్నా ఆమెకు ఆ పింఛను కొంత ఆసరాగా ఉండేది. అది కూడా ఆగిపోవడంతో ఆమె తీవ్ర ఇబ్బందులు పడుతోంది.
ఇదీ చదవండి: CROP LOSS BY CYCLONE: 1.70లక్షల ఎకరాల్లో పంట నష్టం.. కౌలు రైతులకు ప్రత్యేకంగా..