విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఒంటరిగా నివసిస్తున్న గెంబిల శకుంతలను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న 8 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయారు. మృతురాలికున్న ఇద్దరు కుమారులు. రోజువారి పనిలో భాగంగా, మృతురాలి మనవడు తల్లితట్టగా, తీవ్రగాయలతో పడి ఉన్న నానమ్మను చూసి, తండ్రికి సమాచారం ఇచ్చాడు. ఘటన స్థలానికి చేరుకున్న కుమారుడు త్రినాధ్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగలు కోసమే దొంగతనం చేశారనే కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఏఎస్పీ గౌతమి శాలినీ అన్నారు.
ఇదీ చదవండి: పొలం గట్టుపై గడ్డి కోస్తుండగా పాముకాటు...మహిళ మృతి