Oil rates: ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని కారణంగా చూపి వంటనూనెల ధరలు పెంచడం, కృత్రిమ కొరత సృష్టించడంపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. పప్పు ధాన్యాలు, వంట నూనెల ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై.. విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిశోర్‌కుమార్... అధికారులు, వ్యాపారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ బ్రాండ్ల వారీగా నూనెల ధరలను సమీక్షించారు. వాటి లభ్యత, ప్రస్తుత నిల్వలపై ఆరా తీశారు.
Oil rates: తయారీదారుల వద్ద సమస్య కారణంగానే నూనెల ధరలు పెరిగాయని... యుద్ధం ప్రభావమేమీ లేదని వ్యాపారులు తెలిపారు. కొంతకాలానికి ధరలు దిగొచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాలో పండుతున్న పెసలు, మినుములు, కందులు వంటి పప్పుధాన్యాలను.. ఇక్కడే ప్రాసెసింగ్ చేసి.. స్థానికంగానే విక్రయిస్తే ప్రయోజనం ఉంటుందని జేసీ సూచించారు.
కర్నూలు జిల్లాలో హోల్‌సేల్ దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన విజిలెన్స్ అధికారులు... వంట నూనెల ధరలు, నిల్వలపై ఆరాతీశారు. కర్నూలులోని వాల్‌మార్ట్‌లో నూనెల నిల్వలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి.. వంటనూనెలను సివిల్ సప్లై గోదాముకు తరలించారు.
ఇదీ చదవండి:
Jangareddygudem Issue: 'మంచి చేస్తారని వెళ్తే.. అబద్ధాలు చెప్పమన్నారు'