Hunger Cries at Bhogapuram Rehabilitation: విజయనగరం జిల్లా భోగాపురం పునరావాస కేంద్రంలో 45 మంది స్థానికులు ఆకలితో అలమటిస్తున్నారు. జవాద్ తుపాను దృష్ట్యా జిల్లాలోని భోగాపురం వద్ద పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసిన అధికారులు.. భోగాపురం చెరువు పక్కన ఉండే వారిని అక్కడికి తరలించారు.
కానీ.. ఆ నిర్వాసితుల బాధ్యతలు చూడాల్సిన అధికారులు.. వాళ్లను గాలికొదిలేశారు. అక్కడ ఎలాంటి సదుపాయాలూ కల్పించలేదు. ఉదయం నుంచి 45 మంది స్థానికులు ఆకలితో అలమటిస్తున్నారు.
అధికారులు తమను పట్టించుకోవడం లేదని.. ఉదయం నుంచి పస్తులు ఉంటున్నామని స్థానికులు వాపోయారు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వీరి బాధ ఇలా ఉంటే.. అటు పంచాయతీ, ఇటు రెవెన్యూ అధికారులు ఒకరిపై ఒకరు బాధ్యతను నెట్టేయడం గమనార్హం. తప్పు మీదంటే.. మీదంటూ పంచాయతీ, రెవెన్యూ అధికారులు ఒకరిపై మరొకరు చెప్పుకుంటున్నారు.
ఇదీ చదవండి..
YSRCP MLA On Bhuvaneswari : భువనేశ్వరి అనుమతిస్తే.. కన్నీటితో పాదాలు కడుగుతాం: వైకాపా ఎమ్మెల్యే