ఆంధ్ర - ఒడిశా సరిహద్దులోని వివాదాస్పదమైన కొఠియా గ్రామాల్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన అధికారి సౌమ్య మిశ్రా పర్యటించారు. ఆయనకు ఇండియా రిజర్వ్ పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లను చేశారు. తాడివలస గ్రామంలో అక్కడి ప్రభుత్వం నిర్మించిన రెసిడెన్సియల్ స్కూలును అనధికారికంగా ప్రారంభించారు. త్వరలోనే ఈ పాఠశాలను కలెక్టర్, ఎమ్మెల్యే ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. అనంతరం అక్కడి పిల్లలకు రెండు జతల యూనిఫాంలను అందించారు.
ఇదీ చదవండి: చాలా మంది ఐఏఎస్‌లు పేద కుటుంబాల నుంచి వచ్చినవారే: సీఎం జగన్