విజయనగరం జిల్లాలోని పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలోని జగన్నాథపురం అర్బన్ పీహెచ్సీలో నర్సు ఫోటో అంతర్జాలంలో వైరల్‌గా మారింది. యువతికి ఫోన్ మాట్లాడుతూ.. కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన నర్సు హేమలతపై నెటిజన్లు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. వ్యాక్సిన్ వేయడంలో నిర్లక్ష్యం తగదని సూచిస్తున్నారు. ఈ ఘటనపై సదరు ఉద్యోగికి జిల్లా వైద్యాధికారి రమణ కుమారి షోకాజ్ నోటీసు జారీ చేశారు.
ఇవీ చదవండి:
వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం చేయాలి: కలెక్టర్ హరిజవహర్‌లాల్