గిరిశిఖర గ్రామాల్లో గర్భిణులకు ప్రత్యేక సదుపాయాలు కరవవుతున్నాయి. విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం మూలబొడ్డవర పంచాయతీ శివారు చిట్టంపాడు గిరిజన గ్రామంలో ప్రసవ వేదనతో బాధపడుతున్న గర్భిణి జన్ని అచ్చియ్యమ్మను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. డోలీ కట్టి కొండల మీదుగా ఏడు కిలోమీటర్లు మోసుకుంటూ మెట్టపాలెం వరకు తీసుకొచ్చారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న వైద్య సిబ్బంది 108 వాహనంలో గర్భిణిని ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు.
గర్భిణికి రక్తస్రావం కావడంతో అత్యవసరంగా ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఆమెను కొండపై నుంచి కిందకు తీసుకురావడానికి ఎటువంటి రహదారి సౌకర్యం లేకపోవడంతో భర్త గంగులు, మరికొందరు కలసి డొలీ కట్టి మోసుకువచ్చారు. సుమారు 7 కిలోమీటర్లు దూరం మోసుకుంటూ వచ్చారు. అయితే రక్తస్రావం కావడం, రక్తం తక్కువగా ఉండడం తో విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. గిరిశిఖర గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఇలా డొలీ కష్టాలు పడాల్సి వస్తుందని గిరిజన ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు సౌకర్యం కల్పిచాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: