విజయనగంర జిల్లా మక్కువలో మాస్కులు ధరించటంపై ఆటోడ్రైవర్లకు పోలీసులు అవగాహన కల్పించారు. 'నో మాస్క్-నో సీట్' పేరిట సీఐ సింహాద్రినాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాస్కులు ధరించకుండా వస్తే ప్రయాణికులను ఆటో ఎక్కించుకోవద్దన్నారు. అంతే కాకుండా భౌతిక దూరం పాటించేలా.. ఆటోలో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: 'కాపు రిజర్వేషన్.. ఓట్లు దండుకునే మంత్రదండంగా మారింది'