దేశంలో పండించే సుగంధ ద్రవ్య పంటల్లో పసుపు ప్రధానమైనది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పసుపును అధికంగా సాగుచేస్తారు. విజయనగరం జిల్లా కురుపాం మండలం రాష్ట్ర కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు పసుపు సాగులో రకాల ఎంపిక, విత్తన మోతాదు,విత్తనశుద్ది, విత్తుకునేపధ్ధతి,ఎరువుల యాజమాన్యం సస్యరక్షణ చర్యలు వంటి అంశాలను వివరించారు. పసుపు దుంపల్లోని పసుపు పచ్చదనం సుగంధ తైలం వలన ఆహార పదార్థాలకు రంగు, రుచి, సువాసనలు చేర్చుతుందని, ఔషధాలలోను, చర్మ సౌందర్యాన్నికి వన్నె తెచ్చే పరిమళ ద్రవ్యాల తయారిలోను, రంగుల పరిశ్రమల్లోను ఉపయోగిస్తారని కృషివిజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఇదీ చూడండి హఫీజ్ సయీద్ రిమాండ్ పొడిగింపు