ఈ పాఠశాలలో పిల్లలకు కాంపౌండ్, చదువుకునేందుకు బిల్డింగ్, మంచినీటి కోసం బోరు ఉంది. కానీ ఏ ఒక్కటి ఉపయోగపడదు. బోర్ నుంచి కనెక్షన్ ఉంటుంది... నీరు మాత్రం రాదు. గోడకి కులాయి ఉంటుంది... దాని నుంచీ నీరురాదు. మిడ్ డే మీల్స్ వండడానికి కట్టిన వంటగది... చాలా బాగా కనిపిస్తుంది. లోపలికి వెళ్లి వంట చెయ్యాలంటే స్లాబ్ ఎక్కడ పడిపోతుందోనన్న భయం వెంటాడుతోంది. బయట కర్రల పోయ్యిపై వంట చేస్తారు. మరుగుదొడ్లు కొత్తగా ఉంటాయి... వాడేందుకు వీలుండదు. ఇలా చూడటానికి అన్నీ బాగానే ఉన్నా... వాడటానికి మాత్రం పనికిరావని విద్యార్థులు చెబుతున్నారు. అధికారులు స్పందించి... మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి..ఘనంగా ఘంటసాల జయంతి