విజయనగరం జిల్లాలో మరో భద్రాద్రిగా భక్తులు కొలిచే నెల్లిమర్ల రామతీర్థంలో శ్రీరాములవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్రోత్సవాల్లో భాగంగా స్వామివారికి పట్టు పవిత్రాలను శాస్త్రోక్తంగా సమర్పించారు. ప్రాతఃకాల అర్చన, బాలభోగం తర్వాత ఆస్థాన మండపంలో శ్రీమద్రామాయణ సుందరకాండ పారాయణం చేశారు.
ఆలయంలో విశేష హోమాలు, సుందరకాండ హవనం నిర్వహించారు. స్వామివారికి వివిధ నదీ జలాలతో అభిషేకాలు చేసి అలంకరించారు. అనంతరం పట్టు పవిత్రాలను సన్నిధిలోకి తీసుకు వచ్చారు.
ఇదీ చదవండి:
నీటిపై చిన్నారుల మృతదేహాలు.. అపస్మారక స్థితిలో తల్లి, మరో వ్యక్తి!