విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఎస్వీడీ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆర్సీఎం బాలుర స్కూలు ఎన్సీసీ విద్యార్థులు కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణ శివారులోని ఎస్వీడీ కళాశాల నుంచి బెల్గాంలోని రైతుబజార్ వరకు సుమారు నాలుగు కిలో మీటర్లు నినాదాలు చేస్తూ ప్రదర్శన చేశారు. కొవిడ్ వద్దు, వ్యాక్సిన్ ముద్దు, మాస్కులు ధరించండి.. కరోనా నుంచి రక్షణ పొందండి, భౌతిక దూరం పాటించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా వ్యాప్తి