ETV Bharat / state

Nara Bhuvaneswari on Vizianagaram Train Accident: విజయనగరం రైలు ప్రమాదంపై నారా భువనేశ్వరి దిగ్భ్రాంతి - రైలు ప్రమాదం

Nara Bhuvaneswari on Vizianagaram Train Accident: విజయనగరం రైలు ప్రమాదంపై నారా భువనేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. రైలు ప్రమాద ఘటన బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అదే విధంగా విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో క్షతగాత్రులను సీపీఎం నేతలు పరామర్శించారు.

Nara Bhuvaneswari on Vizianagaram Train Accident

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 30, 2023, 1:35 PM IST

Nara Bhuvaneswari on Vizianagaram Train Accident: విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 14 మంది మృతి చెందడంపై నారా భువనేశ్వరి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

  • Deeply saddened by the devastating train accident in Kantakapalli. My heartfelt condolences go out to the families who lost loved ones. I pray for the swift recovery of the injured and strongly urge the government to provide them with the best medical care. pic.twitter.com/6u84QFFOlp

    — Nara Bhuvaneswari (@ManagingTrustee) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

TDP Leader Atchannaidu on Train Accident: విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటన బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను బృందం సభ్యులు పరామర్శించి అండగా నిలుస్తారని తెలిపారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయన్నారు.

CPM leaders visited Vizianagaram Government Hospital: విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీపీఎం నేతలు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని సీపీఎం కోరింది. బాధితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సీపీఎం నేత రాఘవులు కోరారు.

Vizianagaram Train Accident: పట్టాలపై బీభత్సం.. కొనసాగుతున్న సహాయ చర్యలు.. ప్రమాదం జరిగిన తీరు ఇలా..

Andhra Pradesh Leaders About Train Accident: కాగా రైలు ప్రమాదంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందించారు. ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై అశ్వినీ వైష్ణవ్‌ సీఎం జగన్‌ను ఆరా తీశారు.

అదే విధంగా సీఎం వైఎస్ జగన్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి 2 లక్షల రూపాయలు, ఇతర రాష్ట్రాల మృతులకు రెండు లక్షల చొప్పున నష్టపరిహారాన్ని తక్షణమే అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. క్షతగాత్రలకు సత్వర వైద్య సేవలు అందించాలన్నారు.

ప్రమాదంలో క్షతగాత్రులైన వారికి ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని నారా లోకేశ్ అన్నారు. టీడీపీ శ్రేణులు సైతం సత్వరమే ప్రమాద స్థలానికి వెళ్లి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. హాయక చర్యల్లో పాలుపంచుకోవాలని జనసేన శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. బీజీపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి లు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

vizianagaram train accident రైలు ప్రమాదంపై నేతల దిగ్భ్రాంతి.. సహాయక చర్యలు చేపట్టాలన్న సీఎం! బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన నేతలు..

Vizianagaram Train Accident Latest Updates: రైలు ప్రమాదం జరిగిన స్థలంలో సహాయక చర్యలు, ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇప్పటికే విజయవాడ మీదుగా వెళ్లే 27 రైళ్లు రద్దుచేసిన అధికారులు.. ఇతర ప్రాంతాల మీదుగా 28 రైళ్లు మళ్లించారు. అనుకున్న ప్రకారం జరిగితే మధ్యాహ్నానికి ట్రాక్ పునరుద్ధరిస్తామని వాల్తేరు రైల్వే డీఆర్‌ఎం తెలిపారు. అదే విధంగా ప్రమాదంలో చనిపోయిన వ్యక్తుల వివరాలను సైతం అధికారులు వెల్లడించారు. హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు.

విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ.. 14 మంది మృతి!.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.