ETV Bharat / state

రూ.4 కోట్ల మోసం కేసు.. నందిని కాటన్ మిల్లు భాగస్వామి కొల్లా సుధాకర్ అరెస్టు - vizianagaram district latest news

నందిని కాటన్ మిల్లు భాగస్వామి కొల్లా సుధాకర్ అరెస్టు

author img

By

Published : Sep 13, 2021, 7:16 PM IST

Updated : Sep 13, 2021, 8:39 PM IST

19:15 September 13

ARREST

విజయనగరం జిల్లా రామబద్రపురం మండలం ముచ్చర్లవలసలో నందిని కాటన్ మిల్లులో భాగస్వామి కొల్లా సుధాకర్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా కాకులమాను గ్రామానికి చెందిన కొల్లా సుధాకర్ కాటన్ మిల్లు కంపెనీకి, రైతులు అడ్వాన్స్ రూపంలో రూ. 4 కోట్ల మేర మోసం చేసి పరారయ్యాడు. 

జిన్నింగ్ మిల్లు జనరల్ మేనేజర్ చెలవన్.. 2020 ఫిబ్రవరిలో పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి సుధాకర్ పరారీలో ఉన్నాడని.. ఇవాళ రామభద్రపురంలో పట్టుపడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు.. అతడు బంధువుల పేర్ల మీద భూములు కొనేందుకు ఆ డబ్బును వినియోగించినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. దీనిపై పూర్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదీ చదవండి: RAINS EFFECT: వర్షాలతో కూలిన పూరిల్లు.. మహిళకు తీవ్రగాయాలు

Last Updated : Sep 13, 2021, 8:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.