విజయనగరం జిల్లా పార్వతీపురంలో జిల్లా విద్యాశాఖ అధికారిని నాగమణి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొత్త పోలమ్మ పురపాలక ఉన్నత పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకంపై విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం భవిత కేంద్రాన్ని సందర్శించి.. బోధన విధానాన్ని పరిశీలించి.. పిల్లలతో ముచ్చటించారు. మధ్యాహ్న భోజనంలో ఎటువంటి అలసత్వం కనిపించినా సహించేది లేదని స్పష్టం చేశారు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తప్పవన్నారు. నాడు-నేడు పనులపైనా శ్రద్ధ చూపి త్వరలోనే పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలో 96శాతం పాఠశాలలు కో-ఎడ్యుకేషన్లో ఉన్నాయని.. ఉపాధ్యాయులు విద్యార్థుల క్రమశిక్షణపై మరింత శ్రద్ధ చూపాలన్నారు. మరుగుదొడ్ల నిర్వహణ, స్వచ్ఛ పరిసరాలపైన శ్రద్ధ చూపాలని సూచించారు.
ఇదీ చదవండి...