నాగావళిలో వరదనీటి ప్రవాహం పెరిగింది. దీంతో విజయనగరం జిల్లా కొమరాడ మండలం నాగావళి నదికి అటువైపు ఉన్న గ్రామస్థులు ఇటువైపు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల ఇక్కట్లు వర్ణణాతీతం. ప్రస్తుతం కొమరాడ మండల కేంద్రానికి సమీపంలో ఉన్న కొట్టు, తొడుము గ్రామాల మధ్యగా నాగావళి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నది దాటితేనే విద్యార్థులకు చదువులు. వానొచ్చినా.. వరదొచ్చినా ఇదే పరిస్థితి. ఆయా గ్రామాల విద్యార్థులు కొమరాడ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. ఇంటర్, డిగ్రీ చదువులకు పార్వతీపురం వెళ్లాల్సిందే. గత నాలుగు రోజులుగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నాగావళి నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో కొమరాడ మండలంలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు ఇలా నదిలో దిగి నడవాల్సిన పరిస్థితి. వానకాలం మూడు నెలలు స్థానికంగా ఇదే పరిస్థితి ఉంటుందని విద్యార్థులు వాపోతున్నారు.
నాగావళిలో పెరిగిన నీటి ప్రవాహం..విద్యార్థుల అవస్థలు
ఎగువన ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో నాగావళి ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలకు వానాకాలం కష్టాలు మొదలయ్యాయి. నాగావళికి వరదొచ్చిన ప్రతిసారి.. పలు గ్రామాల ప్రజలకు ప్రతియేటా రహదారి కష్టాలు తప్పటం లేదు.
నాగావళిలో వరదనీటి ప్రవాహం పెరిగింది. దీంతో విజయనగరం జిల్లా కొమరాడ మండలం నాగావళి నదికి అటువైపు ఉన్న గ్రామస్థులు ఇటువైపు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల ఇక్కట్లు వర్ణణాతీతం. ప్రస్తుతం కొమరాడ మండల కేంద్రానికి సమీపంలో ఉన్న కొట్టు, తొడుము గ్రామాల మధ్యగా నాగావళి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నది దాటితేనే విద్యార్థులకు చదువులు. వానొచ్చినా.. వరదొచ్చినా ఇదే పరిస్థితి. ఆయా గ్రామాల విద్యార్థులు కొమరాడ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. ఇంటర్, డిగ్రీ చదువులకు పార్వతీపురం వెళ్లాల్సిందే. గత నాలుగు రోజులుగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నాగావళి నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో కొమరాడ మండలంలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు ఇలా నదిలో దిగి నడవాల్సిన పరిస్థితి. వానకాలం మూడు నెలలు స్థానికంగా ఇదే పరిస్థితి ఉంటుందని విద్యార్థులు వాపోతున్నారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో చారిత్రక వెంకన్న బావి ను పురపాలక సిబ్బంది పరిశుభ్రం చేస్తున్నారు.దశాబ్దాలుగా బావిలో చెత్త పేరుకుపోయి....దుర్వాసన వస్తుంది.దీనితో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు.కాలనీ వాసులు పురపాలక అధికారులకు ఫిర్యాదు చేయడంతో.....శుభ్రత చేయడానికి నడుం బిగించారు.చారిత్రిక వెంకన్న బావిని శుభ్రం చేసి తాగునీటి సరఫరా చేయాలని ప్రజలు కోరుకుంటారు.
Body:.
Conclusion:.