ప్రకృతి సంపద, వనరులకు నెలవైన ఉత్తరాంధ్రను గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని జనసేన నేత నాగబాబు అన్నారు. విశాఖలోని రుషికొండకు గుండు కొట్టటమే ఇందుకు నిదర్శమని చెప్పారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆయన విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 9 నియోజకవర్గాలకు చెందిన జనసేన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. విజయనగరంలోని లేక్ ప్యాలెస్ హోటల్లో జనసైనికుల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఉత్తరాంధ్రలోని జనసేన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వారి సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నానన్నారు. పార్టీలో అక్కడకక్కడ నాయకత్వ లోపాలు, విభేదాలున్నా.. బలమైన కార్యకర్తలున్నారని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎంతో విలువైన ఖనిజ సంపంద, వనరులున్నాయని పేర్కొన్నారు. కానీ.., ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం వలసలు పోవాల్సిన ధైన్యం నెలకొందని అన్నారు. గత, ప్రస్తుత పాలక ప్రభుత్వాల దోపిడి ఈ పరిస్థితులకు కారణమని చెప్పారు. చిరంజీవి జనసేన పార్టీలోకి వచ్చే అవకాశం లేదని.., ఆయన కళామతల్లి సినిమాలతోనే ప్రశాంతంగా ఉన్నారని అన్నారు. ఏదీ ఏమైనా ఆయన ఆశీస్సులు జనసేన పార్టీకి ఎల్లవేళలా ఉంటాయన్నారు.
ఇవీ చూడండి