'మూఢనమ్మకాలతో కవల శిశువుల పొట్టలపై వాతలు' విజయనగరం జిల్లా ఊపుగుడ్డి గ్రామంలో దారుణం జరిగింది. మూఢ నమ్మకం కవల శిశువుల ప్రాణాలకు సంకటంగా మారింది. చర్మవ్యాధి సోకిందనే కారణంతో చిన్నారుల పొట్టలపై పైడమ్మ అనే ముసలమ్మ వాతలు పెట్టింది. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆ ముసలమ్మ, చిన్నారుల తల్లి మరణించారు. పిల్లలకు పాలిచ్చేవారు లేక ఆరోగ్యం క్షీణించిన ఆ ఇద్దరి చిన్నారులను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించటంతో వాతల విషయం వెలుగులోకి వచ్చింది. నొప్పితో విలవిలలాడుతున్న చిన్నారులకు వైద్యులు చికిత్స అందించి ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. ప్రాణాపాయం లేకుండా శాయాశక్తులా కృషి చేస్తామని వైద్యులు తెలిపారు.గ్రామాల్లో ఇలాంటి ఘటనలో తరచూ జరుగుతూనే ఉన్నాయని... గ్రామస్థుల్లో మూఢనమ్మకాలపై అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా జనాల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.
ఇవీ చూడండి-చరిత్రకు సాక్ష్యాలు... ఆయన వద్ద ఉన్న నాణేలు